
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం (17న)తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని గురువారం టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఖరారయిన వారికి శుక్రవారం నుంచి బీఫారాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉంటున్న ఉత్తమ్ శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అభ్యర్థులకు బీఫారంలు ఇవ్వనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment