సాక్షి, హైదరాబాద్ : మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు.. ఐదెకరాల పోలం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కూమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన సరిహద్దుల్లో అనేక మంది సైనికలు ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వారికి సమాజంలో గౌరవమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను 16 ఏళ్లకే డిఫెన్స్‌లో చేరానని.. మిగ్21, 23 యుద్ధ విమానాలను నడిపానని తెలిపారు.
మాజీ సైనికులకు ప్లాట్లు, ఐదేకరాల పోలం ఇవ్వాలని.. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇవి అమలు కాలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక మాజీ సైనికలు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రభుత్వపరమైన ఉద్యోగాల్లో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. చనిపోయిన, గాయపడ్డ సైనికలుకు ఆర్థిక సాయంతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాజీ సైనికుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment