ex army officers
-
Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు
ముంబై: కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్ చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ వర్షారాయ్ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్ జూలై 19న ప్రారంభమై జూలై 22న ముగిసింది. శ్రీనగర్ నుండి ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ఆమె సగటున రోజుకు 40 కి.మీ. పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అరి్పంచారు. ఆమెతో పాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ వర్షా రాయ్ భర్త కశ్మీర్లో ఆర్మీ అధికారిగా ఉన్నారు. -
రఫాలో ఇజ్రాయెల్ సైన్యం దాడి..భారత మాజీ సైనికాధికారి మృతి
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే(46) బలయ్యారు. గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో అతడు ప్రయాణిస్తున్నవాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్ కాలే ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. ‘బిహేవియరల్ సైన్స్’, ‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియల్ లా’లో డిగ్రీలు సాధించారు.ఐఐఎం–లక్నో, ఐఐఎం–ఇండోర్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 2004 ఏప్రిల్‌లో భారత సైన్యంలో చేరారు. 2009, 2010లోఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సేవలందించారు. సైనికుడిగా జమ్మూకశీ్మర్‌లో పని చేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్టుమెంట్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ(డీఎస్ఎస్)లో సెక్యూరిటీ కో–ఆర్డినేషన్ ఆఫీసరుగా చేరారు.అనిల్ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో డీఎస్ఎస్ అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు బయలుదేరగా ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్ కాలే మృతిచెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. ఐరాస సెక్రెటరీ జనరల్ గుటేరస్ ది్రగ్బాంతి కల్నల్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కాలే మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేశారు. అనిల్ కాలే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాజాలో విధి నిర్వహణలో ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను గుటేరస్ ఖండించారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.బందీలను విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. కల్నల్ వైభవ్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సంతాపం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం మొదలైన తర్వాత గాజాలో ఇప్పటివరకు 190 మందికిపైగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరణించారు. గాజాలో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన తొలి విదేశీయుడు అనిల్ కాలే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అనిల్ కాలే కుటుంబం పుణేలో స్థిరపడింది.మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయతి్నస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రశాంత్ కర్దే చెప్పారు. పుణేలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అనిల్ కాలేకు భార్య అమృత, కుమారుడు వేదాంత్, కుమార్తె రాధిక ఉన్నారు. ఆయన సోదరుడు విశాల్ కాలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెపె్టన్‌గా పనిచేస్తున్నారు. సోదరుడి వరుసయ్యే కల్నల్ అమేయ్ కాలే భారత సైన్యంలో పనిచేస్తున్నారు. -
‘మాజీ సైనికులకు ఐదేకరాల భూమి, ప్లాటు’
సాక్షి, హైదరాబాద్ : మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు.. ఐదెకరాల పోలం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కూమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన సరిహద్దుల్లో అనేక మంది సైనికలు ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వారికి సమాజంలో గౌరవమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను 16 ఏళ్లకే డిఫెన్స్‌లో చేరానని.. మిగ్21, 23 యుద్ధ విమానాలను నడిపానని తెలిపారు. మాజీ సైనికులకు ప్లాట్లు, ఐదేకరాల పోలం ఇవ్వాలని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి అమలు కాలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక మాజీ సైనికలు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రభుత్వపరమైన ఉద్యోగాల్లో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. చనిపోయిన, గాయపడ్డ సైనికలుకు ఆర్థిక సాయంతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాజీ సైనికుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. -
కల ఫలించింది.. దీక్ష విరమించారు!
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు.. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరిన తర్వాతే దీక్ష విరమిస్తామని చెప్పారు. కానీ, అంతకుముందే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన ముగ్గురు ప్రముఖులు జంతర్ మంతర్ వద్ద భోజన కార్యక్రమం పూర్తి చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా అమలుచేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.