ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ: తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కొందరు టీఆర్ఎస్ నేతలు తమ అనుచరులతో తనను హత్య చేయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండలో గురువారం ఇక్కడి మీడియాతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం పోరాడినందుకే తనను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. ప్రజలు తనవైపు ఉన్నంత కాలం వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఎమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ తన పదవి కోసం దీక్ష చేయగా.. తాను మాత్రం ప్రజల కోసం దీక్ష చేశానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులతో తనను చంపించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించి, ఆయన అనుమతితో ప్రజా సమస్యలపై తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. తన పాదయాత్రలో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమయినట్టేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment