
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఆరోపించారు. వారిక్కడ శనివారం మాట్లాడుతూ కోదండరాం కొలువు కోసం కొట్లాట సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. మరో 63 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ఉద్యోగాల గురించి మట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేదని మండిపడ్డారు.
ప్రాంగణానికి శ్రీకాంతాచారి పేరు
కాగా ఎల్లుండి (డిసెంబర్ 4) తేదీన సరూర్ నగర్ ఎల్బీనగర్ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ జరుగనుంది. దీంతో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను కోదండరాం పరిశీలించారు. సభా ప్రాంగణానికి శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్టు ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment