
సాక్షి, సిద్ధిపేట : టీఆర్‌ఎస్ అంటే సంక్షేమం.. మహా కూటమి అంటే సంక్షోభం అంటూ టీఆర్‌ఎస్ ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గురువారమిక్కడ గజ్వెల్‌లో ఏర్పాటు చేసిన కుర్మ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వెల్ నియోజకవర్గంలో అభివృద్ధికి.. అవకాశవాదులకు మధ్య పోటీ జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చామని గుర్తు చేశారు.
తెలంగాణ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రేమ ఉంటది కానీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎందుకు ప్రేమ ఉంటదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుర్మలకు గుంటడు జాగ కూడా ఇవ్వలేదు.. కానీ కేసీఆర్ మాత్రం కుర్మలకు హైదరాబాద్‌లో ఐదెకరాల భూమితో పాటు 5 కోట్ల రూపాయలిచ్చారని తెలిపారు. గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి దొంగ చాటుగా రాత్రి పూట ప్రచారం చేస్తున్నాడని హరీశ్ రావు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment