సాక్షి, విశాఖపట్నం : పచ్చ పత్రికలు ఐటీ దాడులను తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఐటీ దాడులతో చంద్రబాబుకు అసలు సంబంధం లేదని ఆ పత్రికలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అయిదు రోజుల ఐటీ దాడుల తర్వాత రూ. 2000 కోట్ల అవినీతి జరిగిందని అధికారులే ప్రెస్ నోట్ ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత ముంబాయిలో ఇన్ ఫ్రా కంపెనీపై దాడులు చేస్తే ఏపిలో లింకులు బయటపడ్డాయని తెలిపారు. కేవలం 2019 ఎన్నికల సమయంలోనే 2 వేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ ఐటీ శాఖ గుర్తించిందని ప్రస్తావించారు. 2014 నుంచి 2019 మద్యకాలంలో చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.(‘ఎల్లో మీడియాకు అది కనిపించడం లేదు’)
చంద్రబాబు పాలనలో ప్రతి పథకం దోచుకోవడానికే పెట్టారని తాము ఆనాడే ఆరోపించామని, పోలవరం నుంచి అమరావతి వరకు దేనిని ఆ ప్రభుత్వం వదలలేదని దుయ్యబట్టారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా అమరావతి రాజధాని పేరుతో దోచుకుని అక్కడ ప్రజలను మోసం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లోనూ భారీ అక్రమాలకి పాల్పడ్డారని, గత అయిదేళ్ల పాలనపై సీబీఐ విచారణ జరిగితేనే చంద్రబాబు ఏ స్ధాయిలో అక్రమాలు చేశారో ప్రజలకి తెలుస్తుందని పేర్కొన్నారు. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని ఐటీ శాఖ చెప్పిన తర్వాత 12 లక్షలేంటని, ఈ దాడులపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ పై చంద్రబాబు లోకేష్ ఎందుకు స్పందించలేదని, దాడుల్లో అక్రమాలు బయటపడటం నిజమే కాబట్టి తప్పించుకునే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. హవాలా పద్దతిలో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో బయటపడాలంటే పూర్తి స్ధాయి విచారణ జరగాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment