
ఉత్తమ్.. కునుకు..సోషల్ మీడియాలో డీకే అరుణ
కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా గర్జనకు హాజరైన డీకే అరుణ చేతికి రంగురాళ్ల ఉంగరాలతో ప్రత్యేకంగా కనిపించారు. ఎడమ చేతికి నాలుగు రంగురాళ్ల ఉంగరాలు, కుడి చేతికి మరో ఉంగరంతో ఆకర్శణగా నిలిచారు. వేదికపైన ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. అనంతరం మహిళా కార్యకర్తలతో సెల్ఫీ దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఉత్తమ్.. కునుకు
సభకు కాస్త ఆలస్యంగా హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ వేదికపై కొద్ది క్షణాలపాటు కునుకు తీశారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తున్నారని గమనించిన అనంతరం నవ్వులు చిందించారు.
Comments
Please login to add a commentAdd a comment