సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అమరావతి భారీ నిర్మాణాలకు అనుకూలమేనని ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు.
(చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ)
‘అమరావతికి వరద ముప్పు లేదంట. రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చివరకు కోల్‌కత, ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది. చంద్రబాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క’అని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
మరో ట్వీట్‌లో.. ‘అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్రబాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్, సింగపూర్, చైనా, కజాకిస్థాన్, మలేసియా, థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు’అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
(చదవండి : టీడీపీది హీనమైన చరిత్ర : సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment