ఆంధ్రజ్యోతి వశీకరణ వార్తలు పట్టించుకోవద్దు! | Vijaya Sai Reddy Sensational Comments on Yellow Media | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి వశీకరణ వార్తలు పట్టించుకోవద్దు!

Published Mon, Apr 8 2019 10:38 AM | Last Updated on Mon, Apr 8 2019 3:40 PM

Vijaya Sai Reddy Sensational Comments on Yellow Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల కుట్రలో భాగంగా ఆంధ్రజ్యోతి, కులమీడియా రాసే వశీకరణ వార్తలను పట్టించుకోవద్దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా చంద్రబానాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వచ్చే 4 రోజులు ఆంధ్రజ్యోతి, కులమీడియా ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు రేపే కుట్ర పూరిత వార్తలు ఇస్తాయి. కట్టుకథలతో చంద్రబాబుకు జోల పాడుతాయి. పోలింగ్ పూర్తయ్యేదాకా ప్రజానీకం వీళ్ల ‘వశీకరణ’ వార్తలను పట్టించుకోవద్దని విజ్ణప్తి చేస్తున్నా. బాధలు, కష్టాలు లేని జగనన్న రాజ్యం వస్తోంది.’  అని ట్వీట్‌ చేశారు.

‘జ్యోతి రాధాకృష్ణలాంటి పచ్చ దళారి తప్పుడు రాతలతో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. కిరసనాయిలు, రేషన్ బియ్యం స్మగ్లర్‌గా జీవితం మొదలు పెట్టిన ఆయన వేల కోట్లు పోగుచేసుకున్న స్టోరీలన్నీ ప్రజలకు తెలుసు. వేచి చూడు. ఎక్కడ మొదలయ్యరో అక్కడికే చేరతారు.’అని మరో ట్వీట్‌లో హెచ్చరించారు.

‘పప్పుకు నోరు తిరగక ‘మందల’గిరి అని పలికితే చంద్రబాబు ఆస్థాన కులజ్ణానులు విరాట పర్వాన్ని శోధించి చిట్టినాయుడే కరెక్టని తేల్చారట. అర్జునుడు ఆల మందలను మళ్లించింది అక్కడే కాబట్టి ‘మందల’గిరేనని కుండబద్దలు కొట్టారట. మంగళగిరి పేరు సవరించాలని తుప్పునాయుడుకి సిఫార్సు చేశారట.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను గందరగోళం చేయడానికి తోక పత్రిక ఫేక్‌ సర్వే పేరిట కుట్రకు తెరలేపి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఆ మొన్న లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వే అంటూ అభాసుపాలైన పచ్చ మీడియా.. నిన్న కార్పొరేట్‌ చాణక్య అనే సర్వేతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా అనేక కుట్రలకు తెరలేపుతారని, అప్రమత్తంగా ఉండాలని ప్రతిసభలో సూచిస్తున్న విషయం తెలిసిందే. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా చూపిస్తున్న పచ్చమీడియాపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement