
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి అవసరం లేదని.. అది ఓ గుదిబండ వంటిదని, దాని రద్దు గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, దాదాపు 37 సంవత్సరాల క్రితం 'ఈనాడు' దినపత్రికలో ప్రచురించిన సంపాదకీయాన్ని గుర్తు చేస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'ఎల్లో మీడియాకు నిర్దిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి 'జ్ఞానాన్ని' వెదజల్లుతున్నాయి' అని ఆయన అన్నారు.కాగా.. 1983, మార్చి 28 సోమవారం ప్రచురితమైనట్టుగా కనిపిస్తున్న ఈ ఎడిటోరియల్ వ్యాసంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడటం గమనార్హం. 'వారి కదలికలపై కుల మీడియా నిఘా పెట్టింది'
కాగా మరో ట్వీట్‌లో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడి రియాక్షన్‌ను ఎప్పటిలాగే సోషల్ మీడియా ముందుగానే ఊహించింది. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందే ఈయన అమ్మా అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత కదా!' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (పూల ఖర్చు వృథా అయినట్టేనా బాబూ..!)
Comments
Please login to add a commentAdd a comment