సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'విశాఖ గ్యాస్ బాధితులను పరామర్శిస్తా. వాళ్లకు భారీగా ఆర్ధిక సాయం చేసి ఆదుకుంటా అని చెప్పినోడు కరకట్ట నుంచి కదలడం లేదు. ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు. అధికారం పోయినా, పార్టీ వదిలి పోవద్దని కోట్ల డబ్బు ఆశ చూపిస్తున్నాడంటే ఏ రేంజిలో దోచుకున్నాడో ఊహించొచ్చు' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: పప్పూ.. నాన్న మీద అలిగావా?
కాగా మరో ట్వీట్‌లో.. 'ఇంకెక్కడి తెలుగుదేశం. ప్రజలకు దూరమై ఏడాదైంది. ఎల్లో మీడియా, ఆ పార్టీ వెబ్ సైట్లలో మాత్రమే తరచూ ఉరుములు వినిపిస్తుంటాయి. క్యాడర్ లేదు, ఓటు బ్యాంకు లేదు. అధికారం ఉంటేనే మాట్లాడతారంట. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై, అనుకూల వ్యవస్థలను ఉసిగొల్పితే ప్రజాక్షేత్రంలో విజయం సిద్ధిస్తుందా?' అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చదవండి: టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే
'ఇంకెక్కడి తెలుగుదేశం.. దూరమై ఏడాదైంది'
Published Wed, May 27 2020 12:12 PM | Last Updated on Wed, May 27 2020 12:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment