సాక్షి, అవరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బాబుపై విరుచుకుపడ్డారు. ‘గతంలో వార్షిక బడ్జెట్, టీడీపీ మేనిఫెస్టోలాగే అంతా ఉత్తుత్తి వ్యవహారంగా ఉండేది. ప్రణాళిక కేటాయింపులతో ప్రజల జీవన ప్రమాణాలు మారిపోతాయని ఎల్లో మీడియా వారం రోజులు భజన చేసేది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపించేది. ఇప్పుడలా కాదు. బడ్జెట్ పత్రానికి ప్రామాణికత వచ్చింది’.అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా, రిజర్వు బ్యాంకు దగ్గర చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్), ఓవర్ డ్రాప్ట్‌లతో రాష్ట్రాన్ని అస్థవ్యస్థం చేశాడు బాబు గారు. అనుభవం అంటే ఇదేనా. రూ 2.36 లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఆస్తులు పెంచకుండా అందినకాడికి దోచుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లో ఇలాగే చేశారా’ అని ప్రతిపక్షనేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘కుటుంబానికో గుడ్డు కూడా రాదు కదా బాబూ’)
Comments
Please login to add a commentAdd a comment