సాక్షి, న్యూఢిల్లీ : అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాగైనా అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ...ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియా,టీవీలు, రేడియోల ద్వారా తన ప్రకటన కోసం వేచి చూడండి అంటూ ఉత్కంఠ రేపారు. ప్రధాని ఏమి సంచలన ప్రకటన చేస్తార న్న అంశం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని జాతినుద్దేశించి ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో దేశ భద్రతకు సంబంధించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు మోదీ ప్రకటనపై ట్విటర్లో పలు సెటైర్లతో ట్వీట్లు వెల్లువెత్తాయి.
చదవండి : సూపర్ పవర్‌గా భారత్ - మోదీ
मेरे प्यारे देशवासियों,
— Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019
आज सवेरे लगभग 11.45 - 12.00 बजे मैं एक महत्वपूर्ण संदेश लेकर आप के बीच आऊँगा।
I would be addressing the nation at around 11:45 AM - 12.00 noon with an important message.
Do watch the address on television, radio or social media.
Comments
Please login to add a commentAdd a comment