![We will fight for the guarantees - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/15/jiy.jpg.webp?itok=20sylrJM)
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, అసెంబ్లీ సీట్లపెంపు హామీల సాధనకు పార్లమెంటు సమావేశాల్లో పట్టుబడతామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో తెలంగాణకు మంజూరు చేసిన ఎయిమ్స్‌కు కేంద్రం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని, అలాగే హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, అసెంబ్లీ సీట్లపెంపు తదితర అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. అంశాల వారీగా కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రయోజనాలు, హామీల సాధనలో వెనక్కుతగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment