మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై యలమంచిలి రవి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. పదవుల కోసం తాను పార్టీ మారలేదని, తనకు అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు తనను రెండుసార్లు మోసం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీపై నమ్మకం పోయిందన్నారు. కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీతో చేరినట్లు యలమంచిలి రవి తెలిపారు.
‘టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. అవే నేను పార్టీ మారడానికి దోహదపడ్డాయి. రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని యలమంచిలి రవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment