యశోమతి ఠాకూర్
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి ఠాకూర్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.
న్యాయవాది అయిన యశోమతి ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలన్న రాహుల్ అభిలాష మేరకే ఆమెను కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment