
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో ఆరు చోట్ల ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. 19వ తేదీన ఉదయం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో, మధ్యాహ్నం కృష్ణా జిల్లా అవనిగడ్డలో, సాయంత్రం గుంటూరు జిల్లా వేమూరులో జరిగే సభల్లో ప్రతిపక్ష నేత ప్రసంగిస్తారు. 20వ తేదీన ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో ఉదయం, నెల్లూరు జిల్లా కావలిలో మధ్యాహ్నం, చిత్తూరు జిల్లా పలమనేరులో సాయంత్రం జరిగే బహిరంగ సభల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారు.