
సాక్షి, ఒంగోలు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 98వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈమేరకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. సోమవారం ఉదయం కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిన్నారికట్ల, చిన్నారికట్ల జంక్షన్, కంభాలపాడు మీదుగా పోతవరం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. మూడు గంటలకు పొదిలి మండల కేంద్రం చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆతరువాత సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రికి అక్కడే బస చేస్తారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ తన 97వ రోజు పాదయాత్రను ముగించారు. నేడు 15.3 కిలోమీటర్లు నడిచిన ఆయన మొత్తం 1310.3 కిలోమీటర్లు నడిచారు. చల్లగిరిగిల, గడ్డమీదపల్లి క్రాస్, నందమారెళ్ల, యడవల్లి క్రాస్ మీదుగా పెదారికట్ల వరకూ పాదయాత్ర సాగింది.
Comments
Please login to add a commentAdd a comment