
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర 109వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం చీరాల నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కొత్తపేట, ఆంధ్ర కేసరి జూనియర్ కళాశాల, బాలాజీ థియేటర్, పేరాల, ఐటీసీ, ఆదినారాయణ పురం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఏపూరు పాలెం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం సాయంత్రం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 108వ రోజు ప్రకాశం జిల్లా చీరాలలో ముగిసింది. శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ 108వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అంబేద్కర్ నగర్, వేటపాలెం, దేశాయిపేట, జండ్రపేట, రామకృష్ణాపురం మీదుగా చీరాల వరకు యాత్ర కొనసాగింది. దారి పొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘన స్వాగతం లభించింది. నేడు జననేత వైఎస్ జగన్ 12.5 కిలోమీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మొత్తం వైఎస్ జగన్ 1,462 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment