సాక్షి, యలమంచిలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 246వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జననేత రాంబిల్లి నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం మండలంలోని వెంకటాపురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ మీదుగా పాదయాత్ర సాగుతుంది.
తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. అచ్యుతాపురం మీదుగా రమణ పాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
246వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Published Sat, Aug 25 2018 8:52 PM | Last Updated on Sat, Aug 25 2018 8:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment