సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనసా, వాచా, కర్మణా అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీయిచ్చారు. ఎన్నికల ప్రణాళిక పవిత్రమైనదని, మేనిఫెస్టోలో చెప్పిన విషయాలకు కట్టుబడాలని అన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో పేరుతో మోసం చేయడం తగదన్నారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎన్నికల హామీలు చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపించిన తర్వాత 2024లో ఓట్లు అడుగుతామని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసినప్పుడే పాలకులపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు.
My manifesto for the welfare and empowerment of the people of AP: https://t.co/wOQQXAwJ1H #YSRCPManifesto2019 pic.twitter.com/QOweHi71RV
— YS Jagan Mohan Reddy (@ysjagan) 6 April 2019
2014 ఎన్నికల్లో చంద్రబాబు దాదాపు 650 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టోను తెలుగు దేశం పార్టీ వెబ్‌సైట్‌లో కూడా కనపడకుండా చేశారని తెలిపారు. ఈ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలు గమనిస్తే చంద్రబాబును చొక్కా పట్టుకొని నిలదీస్తారేమోనని ఆయన భయం పడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి, ఒక కొత్త అధ్యాయానికి ఈ రోజు నాంది పలుకుతున్నామని వైఎస్ జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోను తమ పార్టీ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందులోని అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామన్నారు. మేనిఫెస్టో హామీలకు జవాబుదారీగా ఉంటానని చెప్పారు. (చదవండి: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల)
Comments
Please login to add a commentAdd a comment