
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 100 మెగా వైద్యశిబిరాల ప్రారంభోత్సవ పోస్టరును బుధవారం విశాఖలోని ఆరిలోవ కూడలిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో డెంగీ, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.శివభరత్‌రెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని, ఆరుమాసాలుగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రే లేడని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి రావడం చంద్రబాబుకు సిగ్గు చేటన్నారు.

Comments
Please login to add a commentAdd a comment