సాక్షి, అమరావతి : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బడ్జెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్ తోసిపుచ్చారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి కౌన్సిల్ హాలు ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, సీపీఎంల కార్పొరేటర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని తెలిసినా.. రూ.1968కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి బిల్ల తేలేని పాలకపక్షం..ఎన్నికల ముందు బడ్జెట్ అంకెలను పెంచిందని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు డబ్బులు కట్టించుకొని ఇప్పుడు లబ్ధిదారులకు సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం భవిష్యత్తులో పోరాటం చేస్తామని రెండు పార్టీల కార్పొరేటర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment