
సాక్షి, విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార‍్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారు. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి జమ్మలమడుగులో ప్రచారం చేశారు. ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డి కడపకి ఎంపీ సీటు ప్రకటించారో... అప్పుడే వివేకానందరెడ్డి హత్యకే బీజం పడింది. గతంలో వైఎస్ జగన్‌ను కూడా హతమార్చడానికి కూడా యత్నించారు. సిట్‌పై నమ్మకం లేదు. సిట్ చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తుంది. అందుకే సీబీఐతో విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి...(వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే!)
ఓట్లనే అనుకున్నాం...మనుషులన్నే తొలగిస్తున్నారు..
వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వివేకా హత్య వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఓట్లనే తొలగిస్తున్నారనుకున్నామని... కానీ మనుషులనే తొలగిస్తున్నారని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, సాక్షాత్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నేత చిన్నాన్న హత్యకు గురయ్యారన‍్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. వైఎస్సార్ జిల్లాలో కొన్ని గ్రామాల్లోకి తమ పార్టీ నేతలు రాకుండా అడ్డుకున్నారన్నారు. వివేకానందరెడ్డిని దారుణంగా, క్రూరంగా హత్య చేశారని, ఈ విషయంలో గవర్నర్, రాష్ట్రపతి జోక‍్యం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment