సాక్షి, గుంటూరు : ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇక కేంద్రంపై ఏం పోరాటం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, బీజేపీలు తమ కుంభకోణాల విషయంలో సవాల్ చేసుకుంటున్నాయని, రెండు పార్టీలు వాటిని బయట పెట్టాలని అంబటి డిమాండ్ చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు పూర్తిగా కుంటుపడ్డాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
వైఎస్ జగన్ పాదయాత్ర ఒక అద్భుతమని, ప్రజల కోసం కష్టపడుతున్న ఇలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య అన్నారు. నాయకుడికి పోరాట పటిమ అవసరమని, అది జగన్కే సాధ్యమన్నారు. పోలింగ్ బూత్ లెవల్ నుంచి కష్టపడి పనిచేస్తే జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని రత్తయ్య అన్నారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ లెవల్ కన్వినర్ల శిక్షణ తరగతుల రెండో రోజు కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, రావి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment