
సాక్షి, తిరుపతి : ఒకప్పుడు వంగవీటి రాధకు గాడ్సేగా కనిపించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు గాంధీగా కనిపించడానికి గల కారణాలు చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ నాయకుడు సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇదే వంగవీటి రాధ తన తండ్రిని హత్య చేయించింది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడేనంటూ ప్రచారం చేసిన సంగతిని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. అప్పుడు రాధకు గాడ్సేగా కనిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గాంధీగా ఎలా కనిపిస్తున్నాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
అంతేకాక వైఎస్సార్ సీపీ ఇప్పటివరకూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని.. రానున్న ఎన్నకల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అప్పులు చేసి కుప్పలు పేరిస్తే వాటిని ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబులాంటి రాక్షసుడి పాలన నుంచి ప్రజలను కాపాడగలిగే ఏకైక వ్యక్తి వైఎస్ జగన మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు.