జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలు.. | ysrcp leader peddareddy takes on JC Diwakar reddy brothers | Sakshi
Sakshi News home page

జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలు..

Published Tue, Dec 5 2017 8:35 PM | Last Updated on Wed, Jul 25 2018 4:58 PM

ysrcp leader peddareddy takes on JC Diwakar reddy brothers - Sakshi

సాక్షి, అనంతపురం : జేసీ దివాకర్‌ రెడ్డి సోదరులపై తాడిపత్రి వైఎస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ పెద్ద వడుగూరు చేరుకున్నసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్దారెడ్డి మాట్లాడారు. ‘జేసీ సోదరులు చేతగాని దద్దమ‍్మలు. 30 ఏళ్లలో తాడిపత్రికి వాళ్లు చేసినందేమీ లేదు. హత్యలు చేయడమే జేసీ సోదరుల సంస్కృతి. వారికి మనుషులను చంపడం అంటే అంత తేలిక. పోలీసు పికెటింగ్‌ సాక్షిగా విజయభాస్కర్‌ రెడ్డిని జేసీ వర్గీయులు హత్య చేశారు. జేసీ సోదరులు ఎంతటి నీచానికైనా పాల్పడతారు. కిష్టిపాడులో వర్గ కక్షలు పెంచారు. తమ అభివృద్ధి చూసి తాడిపత్రి ప్రజలు ఓట్లు వేస్తున్నారని జేసీ సోదరులు అనుకుంటున్నారు. అయితే అది పచ్చి అబద్ధం. వారికి భయపడే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. తాడిపత్రిలోని గ్రానైట్  ఫ్యాక్టరీల నుంచి మాముళ్లు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ స్వేచ్ఛగా బతుకకూడదన్నదే జేసీ సోదరుల లక్ష్యం. 

యాడికిలో ఒక్క ప్రభుత్వ జూనియర్‌కాలేజీ తీసుకు రాలేదు. మన పిల్లలు వ్యవసాయం చేసుకోవాలే తప్ప..మనం బాగుపడటం జేసీ సోదరులకు ఇష్టం లేదు. నియోజకవర్గం పట్ల వారికి దయాదక్షిణ్యాలు లేవు. ఎస్సీలు చర్చికి వెళ్తున్నారని వారికి బీసీ సీ సర్టిపికెట్‌ ఇస్తామని బెదిరిస్తున్నారు. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి మంచినీరు, సాగునీరు తీసుకువస్తాం. 30 సంవత్సరాలు మనం జేసీ సోదరులకు ఊడిగం చేశాం. ఇక వారి పాలనకు చరమగీతం పాడుదాం. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నాను. వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటా. జేసీ సోదరుల వంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం మనకే నష్టం. మా కర్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. తాడిపత్రి గెలుపును పార్టీకి కానుకగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌ సీపీ జెండా ఎగురవేసి, వైఎస్‌ విజయమ్మకు ఈ నియోజకవర్గాన్ని కానుకగా ఇద్దాం’  అని పెద్దారెడ్డి అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement