peddareddy
-
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.పల్నాడుదాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికంకర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపుకాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
తాడిపత్రిలో పెద్దారెడ్డిపై రాళ్లదాడి
తాడిపత్రి/ తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా సోమవారం టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెద్దారెడ్డితో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడి పోలింగ్ సరళిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కుట్ర పన్నారు. పట్టణంలో స్వైర విహారం చేస్తూ ఎక్కడికక్కడ దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక గాంధీకట్ట వద్దనున్న బూత్‌లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న పచ్చ మూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. అదే సమయంలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ వారిని విడిచి పెట్టి వైఎస్సార్సీపీ వర్గీయులపై పోలీసులు ప్రతాపం చూపించడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జోక్యం చేసుకున్నారు. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు సహకరిస్తున్న తమపై పోలీసుల ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ జేసీ సోదరులకు తొత్తుగా మారారని, ఇలా వ్యవహరించడం తగదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు చెప్పారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారికి సర్దిచెప్పి పంపించేశారు. అక్కడి నుంచి పెద్దారెడ్డి ఓంశాంతి నగర్‌లోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తిరిగొస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు ప్రణాళికతో జేసీ అనుచరులు రాళ్లు సిద్ధం చేసుకుని ఒక్కసారిగా పెద్దారెడ్డితో పాటు అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో పెద్దారెడ్డి వాహనంతో పాటు మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. జేసీ అనుచరులు ఎస్పీ సమక్షంలోనే రాళ్ల దాడి కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాల వారిని చెదరగొట్టాయి. డీఐజీ ఇమాన్షు బాబ్జి తాడిపత్రికి చేరుకుని శాంతిభద్రతలను సమీక్షించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. -
ఈయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది?
‘అబ్బయ్యా పీకే.. నేనెవురో తెలుసునా? నెల్లూరు పెద్దారెడ్డిని! అంటే ఎవురో తెలుసునా? ఆ మటుకు తెలీకుండా నువ్వు వూరూ వాడా ఎగిరెగిరి తిరగతా రాజకీయం ఎట్టాజేస్తండావబ్బా? నెల్లూరు టౌన్లోకొచ్చి ‘అయ్యా పెద్దారెడ్డి గారంటే ఎవరు?’ అని అడిగిసూడు.. పసి పిలకాయగూడా సిటికెలో నీ సెయ్యి బట్టుకోని బరబరా ఈడ్సుకోనొచ్చి నా కాడ నిలబెట్టకపోతే అప్పుడడుగు.. అబయా.. నువ్వేదో వొంటిసేత్తో మాయ జేస్తావని ఎలచ్చన్లలో ఎవురినైనా సరే యిట్టే గెలిపించేస్తావని నీకోసం ఎగబడతా వుంటారంట గదా.. నెల్లూరు కాడికొస్తే.. నీకు మించిన ఫాలోయింగు వుండాదబ్బయ్యా నాకు! పెద్దారెడ్డి యేందంటే.. అదే చెల్లతాది యీడంతా గూడా! అద్సరే గానీ.. అబ్బయ్యా పీకే.. ఏందీ సెంద్రబాబు నిన్నేదో పిలిపించుకోని గుసగుసగా మాట్టాడినాడని జనమంతా చెప్పుకుంటావుండారే. ఏముండాదిలేగానీ.. ఈ ఎలచ్చన్లలో ఎట్టాగైనా సరే.. గెలిసేలా సూడు సామీ అని అడిగుంటాడు అంతే గదా! అవును గానీ అబ్బయ్యా.. నాకో అనుమానం.. ఇయ్యేందో వ్యూహాలూ గట్రా అంటారే.. ఆటిలో ఆయన్ని మించినోడు ఎవుడుండాడబ్బా? అప్పుడెప్పుడో.. మామ కొంప ముంచడానికి ఆ పచ్చ పార్టీలో అడుగుపెట్టడానికి ముందు ఆయన కాంగ్రేసులో ఉండగా ఏం జరిగిందో నీకు తెలుసునా అబ్బయ్యా?. కాంగ్రెసు పార్టీ వోళ్లు పెట్టిన కేండేటునే ఓడించడానికి ఈ యెన్నుపోట్ల యీరాసామి.. అదేనబ్బా.. సెంద్రబాబుకు నేను పెట్టుకున్న ముద్దుపేరులే! ఆయన ఏం జేసినాడో తెలుసునా? సిత్తూరు జడ్పీ చైర్మనుకు ఓట్లెయ్యాల్సినోళ్లందరినీ పట్టకపొయ్యి క్యాంపు బెట్టినాడు. ఆళ్లెక్కడుండారో ఎవ్వుడికీ పోపిడి తెలియనియ్యలా? నడిమద్దెలో.. గుట్టుసప్పుడు కాకుండా కారేసుకోని కేరళకి పొయినాడు. ఓటెయ్యాల్సిన ఒక పెద్దమడిసి అక్కడేదో కేరళోల్ల వైద్యం చేయించుకుంటావుంటే.. ఆయన్ని దువ్వి.. ఇంకో కారులో సరిగ్గా ఓటేసే టయానికి ఆయన వొచ్చేలాగా ఎరేంజిమెంటు జేసినాడు. ఏదైతే ఏంది.. సొంత పార్టీ కాంగిరేసునే ఓడించి.. తన ముఠాని నెగ్గించుకున్నాడు. సెంద్రబాబునాయుడు అంత ముదురు తెలివితేటలు సూపించేనాటికి నువు పుట్టినావో లేదోలే పీకే అబ్బయ్యా. రామారావుకు యెన్నుపోటు యెట్టా పొడిసినాడో ఆ కత యీ నడమ కాలం నాటిదే గదా.. నువ్వు యినేవుంటావులే! యీ దేసెంలో రాజకీయం జెయ్యాలనుకున్న పెతి ఒక్కడూ గూడా.. కుర్సీ ఎక్కాలంటే యెన్ని రకాల అడ్డతోవలుంటాయో తెలుసుకోటానికి జరూరుగా చదవాల్సిన పాటం లాంటిది గదబ్బయ్యా అదంతా! హోటల్లో పట్టుమని పదిమంది లేకపోయినా.. ఓయబ్బో ఎమ్మెల్యేలంతా సెంద్రబాబు గూట్లోనే ఉండారని ఊదరగొట్టేసి.. బయటుండేవోళ్లని బయంలోకి నెట్టేసి.. ఆడకి పరుగెత్తుకొచ్చేలాగా జేసేసి.. ఆపట్నే ఆడ్నించి కదల్నీకుండా కూసోబెట్టేసి.. సివరాకరికి ఎన్టీవోడు వొస్తే.. ఆయన మీద సెప్పులేయించి.. నానా రచ్చా జేసినాడు గదా..! అంతకంటె గొప్ప వ్యూహాలు నువు చెప్పబోతావా నాయినా పీకే అబ్బయ్యా!?. ఆయనకి తెలీని డ్రామాలు, తెలీని కుట్రలు, కొత్త వ్యూహాలు నీబోటోడి వోడికి తెలుస్తాయా సామీ. మొన్నటికి మొన్న ఆయన ఇల్లాలిని యెవురో యేదో తప్పుడు కూత అన్నారే అనుకో.! అలిగినాడు.. ఓకే. అరిసినాడు.. డబలు ఓకే. అంతటితో ఊరుకున్నాడా? అన్నవాడెవడో ఒకమారు అంటే.. ఈ పెద్దమడిసి ఊరూరా తిరిగి వందల తూర్లు జనం ముందర అదే మాట అనుకుంటా తన యింటామె పరువు బజార్లో పెట్టేసిండ్లా? ఎందుకు నాయినా.. అద్ది నాయినా వ్యూహం అంటే.. జనం నించి సింపతీ, జాలి కొట్టేసే కిరికిరి అన్నమాట. అంతకంటె గొప్ప ప్లాన్లు జెప్పబోతావా పీకే అబ్బయ్యా!. ఊరూరా తిరిగేది.. నేను ముసిలోణ్నయిపొయినానూ.. నాకు యీసారి సివరాకరి చాన్సు యియ్యండి.. మిగిలిందీ సగిలిందీ యేమైనా వుంటే అది గూడా దోసుకోని తొంగుంటానూ.. అని పాచిపాటే పాడతా ఉండేది..! చూసినావా పీకే నాయినా! యీన ముసిలోడు అయిపోతే యేందబ్బా..? ముసిలోళ్లకి సివరాకరి చాన్సు ఇయ్యాలని రాజ్యాంగంలో రాసుండాదా యెట్టా? ముసిలోళ్లకి జనం ఎగబడి ఓట్లెయ్యాల్నా యెట్టా? అట్టాగేం లేదు గదా! అయినాసరే, సింపతీకోసం ముసిలి డ్రామా అన్నమాట. ముసిలోడు అయిపోతే.. కిష్ణా రామా అనుకుంటా యింట్లో మనవడితో ఆడుకుంటా ఉండొచ్చు గదా? రాజకీయం కొడుకు చేతికియ్యొచ్చు గదా! నలబైనాలుగేళ్ల ఇండస్ట్రీ అంటాడే.. కొడుకుని చేతగాని దద్దమ్మగా తయారుజేసిన పెద్దమడిసి, తాను తప్పుకోని కొడుకు సేతిలో పార్టీని పెట్టాలంటే జడుసుకునే పెద్దమడిసి.. ఆయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది? యిట్టాగ ఆయనకి తెలియని అయిడియాలు ఏముంటాయి సామీ. నువ్వు ఇప్పుడు ఈ ముసిలాయన సరసకొచ్చి ఏం జెయ్యబోతావు?. అయినా పీకే అబ్బయ్యా.. నిన్ను యెతుక్కుంటా వాకిటకు వచ్చిన బేరాన్ని కాలదన్నుకోటం ఎందుగ్గానీ.. సక్కంగా వాడుకో సామీ! రెండు మూడొందల కోట్లయినా నీ నట్టింట్లో కురవకపోతాయా? లచ్చిందేవి ఎవురికైనా చేదవతాదా? లేదు గదా? కాబట్టి కుమ్మేసుకో! యిక సెంద్రబాబుని సీఎం జేసే సంగతంటావా.. నీకెందుకు రంధి.. జగనన్న యింటి బిడ్డ మాదిరిగా జూసుకునే జెనం తేల్చుకుంటారులే! ఉంటా!!. ✍️:::పెద్దారెడ్డి -
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
-
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. ( డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్ చేస్తా ) కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు. కాగా, 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దివాకర్ ట్రావెల్స్ నిషేధిత వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించింది. స్ర్కాప్ కింద కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను కర్ణాటకలో నడుపుతోంది. -
వేట కొడవళ్లతో నరికి దారుణ హత్య
కర్నూలు (న్యూటౌన్): కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి (42) కర్నూలులోని నాగేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు 22 ఎకరాల పొలం ఉంది. దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. 2004లో అదే గ్రామానికి చెందిన మద్దిలేటి రెడ్డి వద్ద ఎకరా రూ. 2 లక్షల చొప్పున రెండెకరాల పొలం ఆయన కొనుగోలు చేశాడు. తర్వాత భూముల ధరలు భారీగా పెరగడంతో తన పొలం తిరిగి ఇవ్వాలని 2013లో మద్దిలేటిరెడ్డి పేచీ పెట్టాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో పంచాయితీ ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌కు చేరింది. సమస్యను కోర్టులో తెల్చుకోవాలని పోలీసులు సూచించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు తీర్పు పెద్దారెడ్డికి అనుకూలంగా రావడంతో మద్దిలేటిరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తన పొలాన్ని తిరిగి దక్కించుకోవాలని వివిధ కుట్రలు పన్నాడు. ముందుగా తన భార్య సూర్యకాంతం పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేశాడు. తర్వాత పొలానికి వెళ్తుండగా వెంబడించి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టించాడు. అయినా, పెద్దారెడ్డి ప్రాణాలతో బయటపడటంతో ఈసారి హత్యకు ప్లాన్ గీశాడు. మాటు వేసి మట్టుబెట్టారు పెద్దకొట్టాల గ్రామానికి చెందిన చిన్న తిమ్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడని తెలియడంతో పెద్దారెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల్లో పాల్గొని మార్గమధ్యంలోని మిరపపొలంలో ఉన్న బోరుబావి వద్ద స్నానం చేసి కర్నూలుకు బయలుదేరాడు. అప్పటికే పొలంలో మాటు వేసి ఉన్న మద్దిలేటిరెడ్డి కుటుంబసభ్యులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, గొడ్డళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథరెడ్డి, ఉలిందకొండ ఎస్ఐ శంకరయ్య, కె. నాగలాపురం ఎస్ఐ కేశవ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో బాధిత కుటుంబం పెద్దారెడ్డి హత్య విషయం తెలియగానే మృతుడి భార్య జయమ్మ, కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి, అన్న సీతారామిరెడ్డి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి భార్య స్పృహతప్పి పడిపోయింది. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు రోహిణి, వసంత, భారతి, కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి సంతానం. పెద్దారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు మద్దిలేటి రెడ్డి, అతని భార్య సూర్యకాంతం, కుమారులు కొండారెడ్డి, అశోక్‌రెడ్డిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథరెడ్డి తెలిపారు. కాగా నిందితులైన మద్దిలేటిరెడ్డి, అతని భార్య ఉలిందకొండ పొలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిది సొంత ఊరు పెద్దకొట్టాల కాగా పాత కల్లూరులో నివాసం ఉంటున్నారు. అక్కడ ఒంటెద్దు బండి నడపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఢిల్లీలో జలజీవన్ మిషన్ కార్యక్రమం
-
అక్రమ మైనింగ్‌కు ఖాకీ సహకారం
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ పనులు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి బయల్దేరుతున్న తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. మైనింగ్ పనుల వద్దకు వెళ్లరాదంటూ ఆంక్షలు విధించారు. అక్రమాలకు సహకరిస్తున్న పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యల్లనూరు: యల్లనూరు మండలం కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మూడు నెలల నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకపోయినా మైనింగ్ జరుపుతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోలేదు. శనివారం అక్రమ మైనింగ్ పనులను అడ్డుకోవడానికి 600 మంది కార్యకర్తలు, కూచివారిపల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కలిసి బయల్దేరడానికి సిద్ధమైన తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తిమ్మంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులను కూడా గృహనిర్బంధం చేశారు. ఎవ్వరూ మైనింగ్ ప్రాంతానికి వెళ్లకుండా తిమ్మంపల్లి, కూచివారిపల్లితో పాటు అటువైపు వెళ్లే అన్ని అన్ని గ్రామాల దారుల వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై మండిపాటు అక్రమ మైనింగ్ పనులను అడ్డుకునేందుకు వెళుతున్న తమను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ఆయన తిమ్మంపల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జేసీ సోదరుల అక్రమాలపై మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, కానీ ఆయన ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విధంగా బ్లాక్‌మేల్ చేశావో అదే తరహాలో తాడిపత్రి ప్రాంతంలోని చెరువులన్నింటినీ నీటితో నింపి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. అనుమతులు లేకుండానే మైనింగ్ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎంపీ జేసీ మైనింగ్ నిర్వహిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇదివరకే తాడిపత్రి ప్రాంతంలోని కోనుప్పలపాడు దేవాలయ ప్రాంతంలో మైనింగ్ నిర్వహించడంతో దేవాలయం చీలికలు ఏర్పడిందన్నారు. దేవాదాయ, అటవీ భూములను సైతం వదిలిపెట్టకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ముచ్చుకోటలో కూడా అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ.. ఇటీవలే అనుమతులు తీసుకున్నారన్నారు. జూటూరు ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల భూములను పేదల నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. తాడిపత్రి సమీపంలోని పెన్నా పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తూ రోజూ వందలాది లారీల రాయిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చాలా మందికి మైనింగ్ చేసుకోవడానికి అనుమతులు ఉన్నప్పటికీ జేసీ దివాకర్‌రెడ్డి వారిని అడ్డుకుంటున్నారన్నారు. తను మాత్రం మైనింగ్ జరుపుకుంటున్నారన్నారు. కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ గురించి అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ పనులకు పోలీసులు కూడా సహకరిస్తుండటం బాధాకరమన్నారు. జేసీ ఆదేశాల మేరకే తనను మైనింగ్ ప్రదేశానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారని, పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అన్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ భారీ విందు
అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రి పోలీసుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఇటీవల ఉన్నతాధికారులు వేటు వేసిన విషయం విదితమే. తాజాగా తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు వరకు చేపట్టిన పాదయాత్రకు మొదట పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి నిరాకరించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పారు. పాదయాత్రకు సిద్ధమైన పెద్దారెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విపక్ష నాయకులు బహిరంగంగా విమర్శలు చేశారు. శాంతిభద్రతల సమస్యలకు కారణం పోలీసులే తాడిపత్రి ప్రాంతంలో శాంతిభద్రతలు తలెత్తడానికి కారణం పోలీసులే అన్న ఆరోపణలు విపక్ష పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. తాడిపత్రిలో పోస్టింగ్‌లకు జేసీ సోదరుల సిఫార్సుల కోసం పాకులాడి పోస్టింగ్‌లు తెచ్చుకున్నపోలీసులు స్వామి భక్తి చాటుకునేందుకు వారు చెప్పిందే తడవుడా ‘జీ హుజూర్’ అంటూ తలూపి న్యాయాన్యాయాలతో పని లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో చట్టం అనేది అధికారపార్టీ నేతలకు చుట్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తన నివాసంలో ఎమ్మెల్యే జేసీకి విందు ఇస్తున్న సీఐ నారాయణరెడ్డి వివాదాస్పదమైనసీఐ నారాయణరెడ్డి పనితీరు తాడిపత్రిలో రూరల్ సీఐ నారాయణరెడ్డి పనితీరు తరచూ వివాదాస్పదమవుతోంది. ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరే పరిశీలించారు. వాస్తవానికి ఎస్ఐగా పనిచేసిన చోటే సీఐగా తొలిపోస్టింగ్ ఇవ్వరు. అలాగే సీఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు కొన్ని రోజులు నారాయణరెడ్డిని పీటీసీకి పంపిన ఉన్నతాధికారులు..ఆ వెంటనే ఆయన ఎస్ఐగా ఎక్కడ పనిచేశారో అదే స్టేషన్‌కు సీఐగా పోస్టింగ్ ఇవ్వడం చాలా విమర్శలకు తావిస్తోంది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కృతజ్ఞతగా నారాయణరెడ్డి తన సొంత గ్రామం వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో సీఐ నారాయణరెడ్డి భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. అనుచరగణంతో లావనూరుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ నారాయణరెడ్డి అనూహ్యరీతిలో స్వాగతం పలికారు. తన గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే జేసీపీఆర్ ఏది చెబితే దానికి తలూపి పాటించడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నది సుస్పష్టం. మరి స్వామి భక్తి చాటుకుంటున్న సీఐ నారాయణరెడ్డి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
జేసీ బ్రదర్స్ ఆటలు ఇక సాగవు: పెద్దారెడ్డి
గుత్తి: తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏడీజే కమలాదేవి గురువారం బెయిల్ మంజూరు చేశారు. తిమ్మంపల్లిలో గత నెల 28న వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలకు పెద్దారెడ్డి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 29న యల్లనూరు పోలీసులు ఆయనను అరెస్టు చేసి మరుసటి రోజు గుత్తి ఏడీజే కోర్టులో హాజరుపరిచారు. ఏడీజే 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం భక్తులకు, జేసీ దివాకర్‌రెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయని పెద్దారెడ్డిని విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని పోలీసు ఉన్నతాధికారులు అభ్యంతరం తెలుపడంతో పెద్దారెడ్డికి బెయిల్ రావడం ఆలస్యమైంది. గురువారం బెయిల్ వచ్చిన విషయం తెలుసుకున్న తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలతోపాటు జిల్లావ్యాప్తంగా వందలాది మంది వైఎస్సార్సీపీ శ్రేణులు గుత్తి సబ్ జైలుకు తరలివచ్చారు. పెద్దారెడ్డి సబ్‌జైలు నుంచి బయటకు రాగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం ఆయన భారీ కాన్వాయ్‌తో తిమ్మంపల్లికి బయలుదేరి వెళ్లారు. పెద్దారెడ్డిని కలిసిన వారిలో పెద్దవడుగూరు సింగిల్‌విండో ప్రెసిడెంట్ గోవర్దన్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గూడూరు సూర్యనారాయణరెడ్డి, జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు వెంకటస్వామిగౌడ్, శేషారెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, శరబారెడ్డి తదితరులు ఉన్నారు. జేసీ బ్రదర్స్ ఆటలు ఇక సాగవు: పెద్దారెడ్డి జేసీ సోదరుల అరాచకాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయని, వారి ఆటలు ఇక సాగవని తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. గుత్తి సబ్‌జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలైన ఆయన భారీ కాన్వాయ్‌తో గాంధీచౌక్ వద్దకెళ్లి అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జేసీ సోదరులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాటికి భయపడబోమని అన్నారు. రాబోయేది జగన్ రాజ్యమన్నారు. పోలీసులు జేసీ ఇంట్లో పని మనుషుల్లా తయ్యారయ్యారని ఘాటుగా విమర్శించారు. జేసీ సోదరులు తాడిపత్రిని మరో బీహార్‌లా మార్చాలనుకుంటున్నారని, వారికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. -
అనంతపురంలో పోలీసుల దురుసు ప్రవర్తన
-
జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలు..
సాక్షి, అనంతపురం : జేసీ దివాకర్ రెడ్డి సోదరులపై తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పెద్ద వడుగూరు చేరుకున్నసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్దారెడ్డి మాట్లాడారు. ‘జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలు. 30 ఏళ్లలో తాడిపత్రికి వాళ్లు చేసినందేమీ లేదు. హత్యలు చేయడమే జేసీ సోదరుల సంస్కృతి. వారికి మనుషులను చంపడం అంటే అంత తేలిక. పోలీసు పికెటింగ్ సాక్షిగా విజయభాస్కర్ రెడ్డిని జేసీ వర్గీయులు హత్య చేశారు. జేసీ సోదరులు ఎంతటి నీచానికైనా పాల్పడతారు. కిష్టిపాడులో వర్గ కక్షలు పెంచారు. తమ అభివృద్ధి చూసి తాడిపత్రి ప్రజలు ఓట్లు వేస్తున్నారని జేసీ సోదరులు అనుకుంటున్నారు. అయితే అది పచ్చి అబద్ధం. వారికి భయపడే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. తాడిపత్రిలోని గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి మాముళ్లు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ స్వేచ్ఛగా బతుకకూడదన్నదే జేసీ సోదరుల లక్ష్యం. యాడికిలో ఒక్క ప్రభుత్వ జూనియర్‌కాలేజీ తీసుకు రాలేదు. మన పిల్లలు వ్యవసాయం చేసుకోవాలే తప్ప..మనం బాగుపడటం జేసీ సోదరులకు ఇష్టం లేదు. నియోజకవర్గం పట్ల వారికి దయాదక్షిణ్యాలు లేవు. ఎస్సీలు చర్చికి వెళ్తున్నారని వారికి బీసీ సీ సర్టిపికెట్ ఇస్తామని బెదిరిస్తున్నారు. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి మంచినీరు, సాగునీరు తీసుకువస్తాం. 30 సంవత్సరాలు మనం జేసీ సోదరులకు ఊడిగం చేశాం. ఇక వారి పాలనకు చరమగీతం పాడుదాం. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉన్నాను. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటా. జేసీ సోదరుల వంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం మనకే నష్టం. మా కర్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. తాడిపత్రి గెలుపును పార్టీకి కానుకగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. తాడిపత్రిలో వైఎస్ఆర్ సీపీ జెండా ఎగురవేసి, వైఎస్ విజయమ్మకు ఈ నియోజకవర్గాన్ని కానుకగా ఇద్దాం’ అని పెద్దారెడ్డి అన్నారు. -
జేసీ అండతోనే అసాంఘిక కార్యకలాపాలు
- తాడిపత్రిలో అభివృద్ధి శూన్యం - వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి టౌన్ : తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అండతోనే తాడిపత్రిలో మట్కా, జూదం, రౌడీజం, భూకబ్జాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమస్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రిలోని భగత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోనే పలు అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు. వాస్తవంగా మట్కా, జూదం. రౌడీజం, భూకబ్జలనే ఇక్కడ అభివృద్ది చేశారని మండిపడ్డారు. కేవలం తప్పులు కప్పి పుచ్చుకోవడానికి పట్టణ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి వచ్చిన డీజీపీని కలిసి వాటిని అదుపు చేయాలని ఎమ్మెల్యే జేసీ కోరారని చెప్పారు. అదేరోజు ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి తమ అనుచరులను అరెస్టు చేయవద్దని హుకుం జారీ చేశారని తెలిపారు. జేసీ అనుచరులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. వీటిపై ఎన్నోసార్లు డీజీపీ, డీఐజీ, ఐజీ, ఎస్పీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో వెంటనే పట్టణ పోలీసు స్టేసన్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేయాలని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. లేకపోతే మా మిత్ర పక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలతో పట్టణ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని సంజీవనగర్, పాతకూరగాయాల మార్కెట్ సమీపంలోని ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యాలయం, సీబీ రోడ్డులోని ప్రైవేటు కార్యాలయం, వాటర్ వర్క్‌రోడ్డు వీధిలోని జూద గృహంపై గతంలో పోలీసులు చేసిన దాడుల్లో అధికార పార్టీకి చెందిన వారు దొరికింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి వస్తున్న ఒత్తిళ్లతో స్థానిక పోలీసులు కేవలం అమాయకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అండతోనే తాడిపత్రి రూరల్‌తో పాటు పెద్దపప్పూరు మండలాల నుండి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోందన్నారు. గ్రానేటుకు సంబంధించి ఒక లారీకి రాయిల్డీ తీసుకొని అదే నెంబర్ మీదగా కొన్ని లారీలు తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. -
21న పెద్దారెడ్డి సంస్మరణ సభ
అనంతపురం సప్తగిరి సర్కిల్: సామాజిక విప్లవకారుడైన పెద్దారెడ్డి సంస్మరణ సభ ఈ నెల 21న కొత్తచెరువులో నిర్వహిస్తున్నట్లు పోతుల సురేష్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1న పెద్దారెడ్డి మృతి చెందారని, ఆయన జ్ఞాపకార్థంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ బంగి. సుదర్శన్, రామాంజినేయులు, అల్లాబకష్, లింగమయ్య పాల్గొన్నారు.