సాక్షి, విజయవాడ: ఆపద వేళలో ఆపద్భాంధవునిగా సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌లు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంటుపడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం దివంగత నేత వైఎస్సార్ 108 సేవలను ప్రారంభించారని కానీ టీడీపీ ప్రభుత్వం ఆ సేవలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. నిర్లక్ష్యంతో అపర సంజీవనిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ఆరోగ్యశాఖను పర్యవేక్షిస్తున్నప్పటికే లంచగొండి విధానలతో 108ని దెబ్బతీశారన్నారు. దీంతో పేదలపైనా, వారి మంచి చెడులపైనా చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ది ఉందో అందరికీ అర్థమైందన్నారు.
ఇదే విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 108 దుస్థితిపై ఎత్తి చూపారని వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం సిగ్గుచేటన్నారు. తమ నేత పాదయాత్రను మంత్రి దేవినేని ఉమా అవహేళన చేసేలా మాట్లాడటం శ్రేయస్కరం కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే ప్రజలు సహించరని తెలిపారు. టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారని ప్రశ్నించారు. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదని అడిగారు. ఆ వార్తలను ఖండిస్తే మంత్రి పదవి పోతదని భయపడుతున్నాడని ఎద్దేవ చేశారు. ఆ వార్తలను కూడా వైఎస్ జగన్ రాయించాడని టీడీపీ నాయకులు చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. (మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment