
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఎవరు చనిపోతారా అని గోతి కాడ నక్కలాగా ఎదురు చూస్తోంది ఎల్లో మీడియా. విశాఖ జిల్లాలో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్న వారు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
(చదవండి: కరోనాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం)
కాగా, విశాఖ జిల్లాలో ఓ వృద్దురాలి మరణంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. చోడవరం ద్వారకానగర్‌కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ కోసం ఎండలో నిలబడి చనిపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సహజ మరణాన్ని ఇలా రాజకీయం చేయడం ఏంటని ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు ఎల్లో మీడియాపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.
(చదవండి: విశాఖలో కోలుకున్న మరో బాధితుడు)
Comments
Please login to add a commentAdd a comment