చంద్రబాబు కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు.. | Ysrcp Mp Yv Subba Reddy Slams Tdp govt and Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి

Published Mon, Mar 5 2018 11:15 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ysrcp Mp Yv Subba Reddy Slams Tdp govt and Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ కోసం వైఎస్‌ఆర్‌సీపీ నడుంకట్టింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సంజీవని అని ఢిల్లీ గడ్డపై పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఐదుకోట్ల ఆంధ్రులకు ప్రత్యేక హోదా సంజీవని అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ వేదికగా తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు సోమవారం ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో మహాధర్నా చేపట్టారు.

ఈసందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రత్యే​క​ హోదా సాధించే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ పోరాటాలు చేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లు, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామన్నారు. గతంలో హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పడు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

గత నాలుగేళ్లుగా విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో  అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేకహోదాపై ప్రకటన రాకపోతే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెడతామని ప్రకటించారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేస్తామని వైవీ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement