సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌పై పాక్ వైమానిక దాడులను తిప్పికొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్యారాచూట్ సాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిపోవాల్సి వచ్చింది. అభినందన్ క్షేమంగా తిరిగి భారత్‌కు తిరిగి రావాలని యావత్ భరత ఖండం వేయి కళ్లతో ఎదురు చూసింది. పూజలు, యాగాలు చేసింది. గడిచిన మూడు రోజులుగా దేశమంతా ‘అభినందన’ స్మరణే. ఇక ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరువలేదని, అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం కూడా ప్రచురించింది. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. (అభినందన్ ఆగయా..)
మరచిపోలేని మీసం..
ఓవైపు భారత్ వింగ్ హీరో అభినందన్ తిరిగి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంటే.. మరోవైపు అందంగా, ఒడుపుగా తీర్చిద్దిన అభినందన్ మీసం పట్ల ఆకర్షణ మొదలైంది. తమిళ సంస్కృతిలోని ఆయన కట్టూ బొట్టూను అనుసరిచేందుకు మనోళ్లు రెడీ అయిపోయారు. ఆయనలా ‘గన్‌స్లింగర్’ మీసం తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడీ గన్‌స్లింగర్ మీసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందన్ వీరత్వంపై ప్రశంసలు కురిపించాడు. ‘మీ వల్లే మేమేంతా నిశ్చింతగా.. గర్వంగా ఉండగలుగుతున్నాం. మీకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.
ఇంతకూ గన్‌స్లింగర్ అంటే..!
పురాతన కాలంలో ప్రత్యర్థి ఎత్తులకు చిక్కకుండా.. వారి సైన్యంపై గుళ్ల వర్షం కురిపిస్తూ గన్‌తో తుత్తునియలు చేసేవారిని గన్‌స్లింగర్ అనేవారు. ధీరత్వం, ఠీవీ కలగలిసిన గన్‌స్లింగర్ శత్రువుల కంటబడినా చాకచక్యంగా తప్పించుకోవడం అతని నైజం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ అభినందన్ మాదిరి గుర్రెపు డెక్క మీసం కలిగి ఉండడం గమనార్హం. అసాధారణ పోరాటపటిమ చూపిన ఈ అమెరికా జనరల్‌కు మిలటరీలో అత్యున్నతమైన మెడల్ ఆఫ్ హానర్ దక్కడం విశేషం.
(‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’)
(చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?)
How proud we are to have you ! Bow down to your skills and even more your grit and courage 🙏 #WelcomeBackAbhinandan . We love you and are filled with pride because of you.#WeAreSupposedToTellYouThis pic.twitter.com/IfqBFNNa3T
— Virender Sehwag (@virendersehwag) 1 March 2019
Comments
Please login to add a commentAdd a comment