
బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రెగ్జిట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా దక్షిణాఫ్రికాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పాఠశాల విద్యార్థులతో సమావేశమైన థెరిసా మే... వారితో కలిసి కాసేపు డాన్స్ చేశారు. విద్యార్థులను అనుకరిస్తూ స్టెప్పులు వేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు...
థెరిసా మే డాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. ‘థెరిసా మే డాన్స్ చూస్తుంటే.. ఆమెకు ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లుగా అన్పిస్తోందని’ ఒకరు కామెంట్ చేస్తే.... ‘థెరిసా మే డాన్స్ ఇంత ఘోరంగా ఉంటుందని తెలియదు. అస్సలు చూడలేకపోతున్నానంటూ’ మరొకరు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఓసారి మేబోట్ డాన్స్ చూడండి’ అంటూ థెరిసా మేపై జోకులు పేలుస్తున్నారు.
Theresa May dances like she’s had her freedom of movement surgically removedpic.twitter.com/PaiSEtcRE9
— James Felton (@JimMFelton) August 28, 2018
I never knew that seeing Theresa May dance would be so uncomfortable to watch pic.twitter.com/TQmymi6W8q
— Ali San (@TheSanPlanet) August 28, 2018
Watching Theresa May dance is one of the cringiest things I’ve ever seen in my life! 😬🤢🤮 pic.twitter.com/3bESRnXZPf
— Alex (@AlexKyri_) August 29, 2018
Comments
Please login to add a commentAdd a comment