తిరువనంతపురం : పెళ్లి మండపానికి కుటుంబ సభ్యులతో బయలుదేరాడు పెళ్లికొడుకు.. ఇంతలో భారీ ట్రాఫిక్ జామ్.. పెళ్లి సమయం సమీపిస్తోంది. ఎం చేయాలో అర్థం కావట్లేదు.. ఇంతలో ఒకరు మెట్రోలో ప్రయాణించండి అని సలహా ఇచ్చారు. అంతే కుటుంబమంతా మెట్రో ఎక్కేసింది.. సమయానికి మండపానికి చేరుకుంది. దీంతో ఆ జంట ఒక్కటైంది. గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొచ్చి మెట్రో తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆ జంట మా పెళ్లిని మెట్రోనే చేసిందని తెలుపుతూ..తమ అనుభావాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రంజీత్‌కుమార్, ధన్యల వివాహం డిసెంబర్ 23న జరిగింది. పెళ్లి రోజు రంజీత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో ఉదయం 6 గంటలకు పాలక్కడ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్నాకులంలోని పెళ్లి మండపానికి కారులో బయలుదేరారు. పెళ్లి ముహుర్తం 11 గంటలకు ఉంది. ఆ సమయం వరకు చేరుతాననే నమ్మకంతో ప్రయాణం ప్రారంభించారు. 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అలువాలో భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోంది. ఇక్కడి నుంచి ఎర్నాకులంకు మరో 30 కీలోమీటర్ల దూరం. ఇంతలో ఒకరు మెట్రో ఎక్కండని సలహా ఇచ్చారు. అలువా మెట్రో స్టేషన్‌కు వెళ్తే తీరా అక్కడ టీకెట్ల కోసం పెద్ద క్యూ.. దీంతో పెళ్లి కొడుకైన రంజీత్ పెళ్లి సమయం సమీపిస్తోంది.. పెళ్లి మండపానికి చేరుకోవాలి సహాయం చేయండి అని బతిమాలుకున్నాడు. చివరకు టిక్కెట్లు సాధించి అనుకున్న సమయానికి చేరి పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొచ్చి మెట్రో రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment