
అత్యంత అరుదైన జాతికి చెందిన పాము ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. తన అందంతో ఆ పాము నెటిజన్లను కట్టిపడేస్తోంది. రెయిన్ బో కలర్స్‌తో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పాముకు సోషల్ మీడియా అంతా ఫిదా అవుతోంది. ఆగ్నేయ ఆసియాలో కనిపించే విషపూరితం కాని ఈ పాములును సన్‌బీమ్ అనే పేరుతో పిలుస్తారు. అయితే వీటిని బంధించి ఇతర ప్రదేశాలకు తరలించలేమని, కొంచెం ఒత్తిడి కలిగిన ఈ పాములు చనిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పాములతో ఔషదాలు తయారు చేయవచ్చని, వీటిని ప్రత్యేకంగా తరలించే ఏర్పాట్లు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment