కోన వెంకట్.. ప్రధాని నరేంద్ర మోదీ(జత చేయబడిన చిత్రం)
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు భిన్నంగా వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా సహా రాజకీయ అంశాలపై స్పందించే టాలీవుడ్ రైటర్ కమ్ మేకర్ కోన వెంకట్ తన ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీజేపీ గెలవటానికి ఈవీఎంలే కారణమంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)ను ఓపెన్ చేశారో.. అప్పుడే ఫలితం ఈవీఎం అని తేలింది. ఇంతకీ ఈవీఎం అంటే మరేమిటో కాదు.. ‘ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ’(ప్రతీ ఒక్కరూ మోదీకి ఓటేశారు) అంటూ కామెంట్ చేశారు. దానికి కొనసాగింపుగా.. నో కామెంట్ అంటూ తెలివిగా వ్యాఖ్యానించారు. ‘చేయాల్సిన కామెంట్ అల్రెడీ చేసేశారు కదా! మీ టైమింగ్ సూపర్’ అంటూ అని కొందరు రీట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అది సెటైర్ అంటూ కోనపై మండిపడుతున్నారు.
When they opened EVMs today in Karnataka (Electronic voting machines) ... The results are... EVM (Everybody Voted for Modi) ... No comments!!
— kona venkat (@konavenkat99) 15 May 2018
Comments
Please login to add a commentAdd a comment