సాక్షి, చెన్నై : ఆచారాల పేరుతో జరిగే కొన్ని వ్యవహారాలు వివాదాస్పదం అయినా... భక్తులు మాత్రం అవేం పట్టించుకోకుండా వాటిని అనుసరిస్తుంటారు. అలాంటిదే ఇక్కడ మనం చెప్పుకోబోయే.. తమిళనాడులోని సంజీవ్ పెరుమల్ గుడి ప్రదక్షిణ వ్యవహారం.
త్రిచి జిల్లాలోని ముసిరి గ్రామంలో సుమారు 2000 వేల పైచిలుకు అడుగుల ఎత్తులో కొండమైన ఉన్న సంజీవ్ పెరుమల్ పురాతన ఆలయం ఒకటి ఉంది. సాధారణంగా ఏ గుడి దగ్గరికైనా వెళ్లితే భక్తుల ప్రదక్షిణలతో కోలాహలంగా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం భక్తులు భయభయంగా ప్రదక్షిణలు చేస్తుంటారు. అందుకు కారణం ఈ గుడి చుట్టు ఉండే గోడ కేవలం సెంటీమీటర్లలో ఉండటమే. ప్రదక్షిణ చేసే సమయంలో కాలు జారిందో ఇక కింద లోయలోకి పడి ప్రాణాలు కోల్పోవటమే.
ఇదిలా ఉంటే తాజాగా ఓ భక్తుడు కొండ మీద నుంచి జారి పడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆర్ముగమ్ అనే ఆటో డ్రైవర్ ఆదివారం గుడిని దర్శించాడు. ఈ క్రమంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సాహసం చేశాడు. రెండు రౌండ్లు చేసి.. మూడోది అవలీలగా చేసేందుకు సిద్ధమైన క్రమంలో పట్టు కోల్పోయి లోయలోకి పడిపోయాడు. అక్కడే ఉన్న భక్తులు ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
నిషేధం విధించినా కూడా...
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ సాహస ఆచారాన్ని నిలిపేందుకు స్థానిక పోలీసులు యత్నించారు. ఇప్పటి వరకు అధికారికంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. ప్రదక్షిణపై కొన్నాళ్లపాటు నిషేధం కూడా విధించారు. అయితే భక్తులు మాత్రం తమ నమ్మకాన్ని చంపుకునే ప్రసక్తే లేదని భక్తులు చెబుతున్నారు. అలా చేస్తే తమకు అదృష్టం వచ్చిపడుతుందని వారు బలంగా నమ్ముతారంట.
ప్రదక్షిణం చేస్తూ జారి పడిన వీడియో
Comments
Please login to add a commentAdd a comment