దేన్నైనా కళ్లతో చూస్తే కానీ నమ్మకూడదని పెద్దలంటుంటారు. కానీ కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ పుణ్యమా అని.. ఏది నిజమో! ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు, మెస్మరైజింగ్ ప్రక్రియలు ఇలాంటి వన్నీ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ! తిమ్మిని బొమ్మిని చేసి.. బొమ్మిని తిమ్మిని చేసే లక్షణం ప్రస్తుతమున్న టెక్నాలజీకి కూడా ఉంది. అలాంటివే ఈ 3డి, 4డి,4కే, 5డి టెక్నాలజీలు. తెరమీద బొమ్మలను మన పక్కగా ఉన్నట్లు భ్రమకలిగించేవి కొన్ని, మనమే సినిమాలోని పాత్రల మధ్యకు వెళ్లినట్లు భ్రమ కలిగించేవి మరికొన్ని. ఇక్కడ మన కళ్లు అందుకు అనుగుణంగా మార్పు చెందుతున్నాయి తప్ప మన భౌతిక స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు.
కేవలం మన కళ్లకు భ్రమను కలిగించటమే అక్కడ జరిగేది. ఇలాంటి కోవకు చెందిన మరో టెక్నాలజీ‘’ ఆప్టికల్ ఇల్యూజన్’’ ఇందులో మన కళ్ల ముందు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు భ్రమ చెందుతాము. ఇది కొంత వింతగానూ.. మరికొంత విచిత్రంగానూ ఉంటుంది. కొంత టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ను సృష్టించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సామాజిక మాద్యమాల్లో మంచి ఆదరణపొందాయి. మీకోసం మచ్చుకో తునక.
Comments
Please login to add a commentAdd a comment