optical illusions
-
వెలుగు స్తంభాలు
నేల నుంచి నింగికి వేసిన కాంతి నిచ్చెనల్లా ఉన్నాయి కదూ! పశ్చిమ కెనడాలో మైనస్ 30 డిగ్రీల చలితో వణికిపోతున్న ఆల్బర్టా ప్రాంతంలో దర్శనమిస్తున్న ఈ నిట్టనిలువు వెలుతురు స్తంభాల సోయగాలు చూపరుల మనసు దోస్తున్నాయి. ఇవి ఏర్పడాలంటే పర్యావరణపరంగా పలు అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. –10 నుంచి –40 డిగ్రీల మధ్యలో వాతావరణం అతి శీతలంగా, హెచ్చు తేమతో, గాలన్నదే వీయకుండా స్తబ్ధుగా ఉండాలి. అలాంటి వాతావరణంలో 0.02 మి.మీ. మందంతో కూడిన బుల్లి మంచు రేణువులు నిట్టనిలువుగా కాకుండా నేలకు కాస్త సమాంతరంగా కిందకు పడుతూ ఉండాలి. వాటి గుండా కాంతి నిర్దిష్ట కోణాల్లో ప్రసరిస్తే ఆ మంచు రేణువులు లక్షలాది బుల్లి అద్దాలుగా మారతాయి. వాటిపై పడుతూ కాంతి ఊహాతీతమైన తీరులో పరావర్తనం చెందుతుంది. ఫలితంగా ఇలాంటి నిలువు వెలుగులు సాక్షాత్కరిస్తాయి. ఆ కాంతికి మూలం వీధి దీపాలు మొదలుకుని చంద్ర కిరణాల దాకా ఏదైనా కావచ్చు. కెనడాతో పాటు అలస్కా, రష్యా తదితర చోట్ల అతి శీతల ప్రాంతాల్లో ఇవి తరచూ ఏర్పడుతుంటాయి. ఇవి నిజానికి కేవలం ఓ దృశ్య భ్రాంతి మాత్రమేనని సైంటిస్టులు అంటారు. వాళ్లేం చెప్పినా స్థానికులు వీటిని మానవాతీత శక్తి తాలూకు విన్యాసాలుగా నమ్ముతుంటారు. ఎగిరే పళ్లేల్లాగే ఇవి కూడా గ్రహాంతరవాసుల వాహనాలని భావిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!
ఈ ఇమేజ్ చూస్తే కేవలం కప్ప మాత్రమే కనిపిస్తోంది కదూ. కానీ సరిగా చూస్తే ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఇది కేవలం మీ ఐక్యూకి మాత్రమే కాదు పరీక్ష. మీరు ఏవిధంగా ఆలోచించగలరు అనేదాన్ని కూడా తెలియజేస్తుంది. ఇలాంటి ఫజిల్స్ మనకు ఎదరయ్యే సమస్యలను ఎలా కూడా చూడాలో తెలుపుతుంది. ఈజీగా ఎలా బయటపడాలో మెదడుకు ఓ ఎక్స్ర్సైజ్లా కూడా ఉంటుంది. అసలు దీనికి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఎలాంటి సంబంధం ఉండదు అనకండి. కొన్ని సమస్యలు మనకు ఓ పట్టాన పరిష్కారం కావు. ఏదో ఒక యాంగిల్ ఆలోచించి ఏ స్టెప్ తీసుకోలేక ఒకింత గందరగోళానకి గురవ్వుతాం. అదే ఒక సమస్యను రెండు లేదా మూడు రకాలుగా ఆలోచించగలిగితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఇక అదంతా సరే! ముందు ఈ ఫోటోలో ఇంకొక చిత్రం కూడా ఉంది ట్రై చేయండి. త్వరగా కనిపెట్టండి. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు కాస్త ఓపికగా చూడండి ప్లీజ్. ఇక ఆ బొమ్మలో కనిపిస్తున్న మరో ఆకృతి (రివర్స్‌లో చూస్తే) ఏంటంటే.. ఓ గుర్రం ముఖం కనిపిస్తుంది చూడండి. చూసే కన్నుని బట్టి ఆకృతి మారుతుంది. అలాగే మన సమస్యను చూసే విధానం బట్టి మనలోని భ్రమలను భయాలు కూడా దూరం చేసుకోగలుగుతాం. (చదవండి: రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!) -
ఈ కాఫీగింజల్లో ఉన్న వ్యక్తి ముఖాన్ని గుర్తించగలరా?
సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రతి చిన్న విషయం ప్రజలకు తొందరగా చేరుతుంది. సోషల్ మీడియాలో వినోదభరిత వీడియోలే కాదు మెదడుకు మేతపెట్టే విషయాలు కూడా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో నిజాలను, విశేషాలను నేర్చుకోవచ్చు. ఈ రకమైన దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. గందరగోళ రూపంలో ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్‌లో నుంచి సమాధానాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఏకాగ్రతను పెంచి మెదడు చురుకుగా పనిచేయించడమే దీని వెనకున్న ఉద్ధేశ్యం. తాజాగా అలాంటి ఫోటోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక ఫోటోలో పెద్ద సంఖ్యలో కాఫీ గింజలు ఉన్నాయి. అయితే అందులో ఓ మనిషి బొమ్మ కూడా దాగి ఉంది. దాన్ని కనుగొనాలాంటూ సవాల్ విసిరారు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనిషి ముఖాన్ని గుర్తించొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. కనిపెట్టడం కష్టంగా ఉంటే ఇక ఈ కింది చిత్రాన్ని చూడండి. అయితే మీరు ఫోటో, పెయింటింగ్ చూసే విధానం ద్వారా మీ మెదడు ,వ్యక్తిత్వం ముఖ్య లక్షణాలు తెలుస్తాయి. మూడు సెకన్లలోపు మనిషి ముఖాన్ని గుర్తించగలిగితే, మీ కుడి మెదడు మీ తోటివారి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు సెకన్ల నుంచి ఒక నిమిషం పడితే, మీ మెదడు కుడి సగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. లేదా ఒకటి నుంచి మూడు నిమిషాల సమయం పట్టినట్లయితే, మీ మెదడు కుడి వైపు సమాచారాన్ని నెమ్మదిగా విశ్లేషిస్తుంది. ఒకవేళ మీకు మూడు నిమిషాలు సరిపోకపోతే, అలాంటి బ్రెయిన్ టీజర్ మీ మెదడుకు సవాలు విసురుతూనే ఉంటుందని ది మైండ్స్ జర్నల్ చెబుతోంది. చదవండి: విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష! -
ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!
కొన్ని రకాల చిత్రాలు అత్యద్భుతంగా ఉంటాయి. పైగా వాటిలో దాగి ఉన్న అసలైన చిత్రాలను మనం తదేకంగా పరికించి చూస్తే గానీ గుర్తిచలేం. అయితే అలా గుర్తించడం కూడా ఒక అందమైన అనుభూతి అనే చెప్పాలి. కొంతమంది కళాకారులు భలే అద్భుతంగా గీస్తారు. అవి చూసినప్పుడు ఒకలా ఉంటుంది. కానీ కాస్త నిశితంగా పరిశీలించి చూస్తే అసలైన కళాఖండం అవగతమవుతుంది. అచ్చం అలానే ఉంటుంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం కూడా . (చదవండి: వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం) అసలు విషయంలోకెళ్లితే...మంచు పర్వతాల్లో గుర్రాల గుంపు నిలబడి ఉన్న ఒక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటగా మనకు ఆ చిత్రం చూసిన వెంటనే అక్కడ ఐదు గుర్రాలు మాత్రమే ఉన్నాయని అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఏడు గుర్రాలు ఉంటాయి. మనం ఒక్కసారిగా పరికించి జాగ్రత్తగా చూస్తేగానీ మనకు అవగతమవ్వదు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూసి ఎన్ని గుర్రాలు ఉన్నాయో లెక్కపెట్టండి మరి. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి. (చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!) -
వైరల్: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓడ!
ఒట్టావా: కంటికి కనిపించేదంతా నిజం కాదు అంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలాంటి వార్తలను చూసినప్పుడు అది కొంత నిజమేననిపిస్తుంది. పై ఫొటోలో ఓడ సముద్రాన్ని వదిలి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది కదూ.. ఆ సముద్ర తీరానికి సమీపంలో ప్రయాణించిన కొలిన్ మెకల్లమ్ అనే వ్యక్తికి కూడా అలాగే అనిపించింది. కళ్లు రుద్దుకుని మరీ చూసినా ఓడ ఆకాశం దిగి నీళ్ల మీదకు రాలేదు. వార్నీ, ఇదేదో విచిత్రంగా ఉందేనని ఫొటో తీసి ఫేస్బుక్లో పెట్టాడు. ఇంకేముందీ, జనాలు దీన్ని ఒకటికి రెండుసార్లు చూస్తూ ఓడ గాల్లోకి ఎలా వెళ్లిందా? అని ఆలోచించి బుర్రలు బద్ధలు చేసుకుంటున్నారు. "నిజానికి సముద్రానికి ఐదు ఇంచుల పైన గాల్లో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓడ నీళ్ల మీదే ఉంది. కానీ అక్కడికి మబ్బులు అతి దగ్గరగా రావడం, దాని ప్రతిబింబం నీళ్ల మీద పడటంతో ఆ ప్రదేశం ఆకాశంలో కలిసిపోయినట్లు అనిపిస్తోంది. అది కదిలేకొద్దీ గాల్లో తేలినట్లు భ్రమ కలిగించింది" అని ఈ ఫొటోను పోస్ట్ చేసిన కొలిన్ మెకల్లమ్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ ఫొటో మాత్రం ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది. చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు వైరల్: విమానంలో పిల్లి రచ్చ.. పైలట్‌పై దాడి -
మీ కళ్లను మీరే నమ్మలేరు!
దేన్నైనా కళ్లతో చూస్తే కానీ నమ్మకూడదని పెద్దలంటుంటారు. కానీ కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ పుణ్యమా అని.. ఏది నిజమో! ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు, మెస్మరైజింగ్ ప్రక్రియలు ఇలాంటి వన్నీ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ! తిమ్మిని బొమ్మిని చేసి.. బొమ్మిని తిమ్మిని చేసే లక్షణం ప్రస్తుతమున్న టెక్నాలజీకి కూడా ఉంది. అలాంటివే ఈ 3డి, 4డి,4కే, 5డి టెక్నాలజీలు. తెరమీద బొమ్మలను మన పక్కగా ఉన్నట్లు భ్రమకలిగించేవి కొన్ని, మనమే సినిమాలోని పాత్రల మధ్యకు వెళ్లినట్లు భ్రమ కలిగించేవి మరికొన్ని. ఇక్కడ మన కళ్లు అందుకు అనుగుణంగా మార్పు చెందుతున్నాయి తప్ప మన భౌతిక స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం మన కళ్లకు భ్రమను కలిగించటమే అక్కడ జరిగేది. ఇలాంటి కోవకు చెందిన మరో టెక్నాలజీ‘’ ఆప్టికల్ ఇల్యూజన్’’ ఇందులో మన కళ్ల ముందు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు భ్రమ చెందుతాము. ఇది కొంత వింతగానూ.. మరికొంత విచిత్రంగానూ ఉంటుంది. కొంత టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ను సృష్టించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సామాజిక మాద్యమాల్లో మంచి ఆదరణపొందాయి. మీకోసం మచ్చుకో తునక. -
మన కళ్లను మనమే నమ్మలేని వీడియో
-
బికినీతో బీచ్‌లో ఉన్నది ఎవరు?
ఫేస్ బుక్ శకం మొదలైన తర్వాత 'ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్' అనే నానుడికి అర్థం మారిపోయింది! ఫేస్ బుక్ లో కొన్నిసార్లు ఫేక్ ఫేస్ లు మనల్ని మోసం చేసినట్లే.. కేవలం కెమెరాతో (ఫొటోషాప్ టెక్నిక్ ఉపయోగించకుండా) తీసిన ఈ ఫొటోలూ అంతే మోసానికి గురిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో షూట్ చేసిన ఈ ఫొటోలను 'బోర్డ్ పాండ' అనే మ్యాగజీన్ సమీకరించింది. పుస్తకం అడ్డుపెట్టుకున్న వీళ్ల ముఖాలు చూసి మోసపోవద్దని మనవి. వీటిలో కొన్ని ఫొటోలు యాదృచ్ఛికంగా తీసినవైతే, మరికొన్ని సెటప్ చేసినవి. పొలిటికల్ బాడీబిల్డర్ పుతిన్.. బాన పొట్టతో కూర్చున్నట్లు, అబ్బాయి బికినీ వేసుకుని బీచ్ లో పడుకున్నట్లు.. రకరకాల దృశ్యభ్రాంతులు కలిగిస్తాయీ ఫొటోలు..