ఒట్టావా: కంటికి కనిపించేదంతా నిజం కాదు అంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలాంటి వార్తలను చూసినప్పుడు అది కొంత నిజమేననిపిస్తుంది. పై ఫొటోలో ఓడ సముద్రాన్ని వదిలి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది కదూ.. ఆ సముద్ర తీరానికి సమీపంలో ప్రయాణించిన కొలిన్ మెకల్లమ్ అనే వ్యక్తికి కూడా అలాగే అనిపించింది. కళ్లు రుద్దుకుని మరీ చూసినా ఓడ ఆకాశం దిగి నీళ్ల మీదకు రాలేదు. వార్నీ, ఇదేదో విచిత్రంగా ఉందేనని ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఇంకేముందీ, జనాలు దీన్ని ఒకటికి రెండుసార్లు చూస్తూ ఓడ గాల్లోకి ఎలా వెళ్లిందా? అని ఆలోచించి బుర్రలు బద్ధలు చేసుకుంటున్నారు.
"నిజానికి సముద్రానికి ఐదు ఇంచుల పైన గాల్లో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓడ నీళ్ల మీదే ఉంది. కానీ అక్కడికి మబ్బులు అతి దగ్గరగా రావడం, దాని ప్రతిబింబం నీళ్ల మీద పడటంతో ఆ ప్రదేశం ఆకాశంలో కలిసిపోయినట్లు అనిపిస్తోంది. అది కదిలేకొద్దీ గాల్లో తేలినట్లు భ్రమ కలిగించింది" అని ఈ ఫొటోను పోస్ట్ చేసిన కొలిన్ మెకల్లమ్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ ఫొటో మాత్రం ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment