ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్‌ ఇవ్వగలరా?: వర్మ | Ram Gopal Varma Setairic Tweets on Present Indian Politics  | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 12:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Ram Gopal Varma Setairic Tweets on Present Indian Politics  - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ( ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ బాలీవుడ్‌ రచయితలకు ఓ సవాల్‌ విసిరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు మించిన స్క్రిప్ట్‌ అందిచగలరా అని ప్రశ్నించారు. 

ఓ వైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం, ఆయన కొడుకు కార్తీల సీబీఐ విచారణ, కాంగ్రెస్‌ అవినీతి, బీజేపీ ప్రతీకారం, మనీ లాండరింగ్‌, నీరవ్‌ మోదీ బ్యాంకుల కుంభకోణం, ఇంద్రాణి ముఖర్జీ హత్య కేసులను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. వీటన్నిటి కన్నా బలమైన స్క్రిప్ట్‌తో గొప్ప బాలీవుడ్‌ రచయితలు ముందుకు రాగలారా? నాకు సందేహమే అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. వర్మ చేసిన ఈ సెటైరిక్‌ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement