విమానంలో బిత్తిరి చర్యలు.! | Woman Tweet About Co Passenger Who Stripped on Flight Sparks Angry Reactions | Sakshi
Sakshi News home page

విమానంలో బిత్తిరి చర్యలు.!

Published Mon, Feb 25 2019 11:56 AM | Last Updated on Mon, Feb 25 2019 12:08 PM

Woman Tweet About Co Passenger Who Stripped on Flight Sparks Angry Reactions - Sakshi

విమాన ప్రయాణంలో ఓ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌లో పంచుకోగా నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానంలో ఓ వ్యక్తి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని లిజ్జి థాంప్సన్‌ అనే యువతి ట్వీట్‌ చేసింది. ప్రయాణంలో ఉన్నామనే సోయి మరిచి ఆ వ్యక్తి సిగ్గు లేకుండా అందరి ముందు ప్యాంట్‌ విప్పి బాక్సర్‌ షాట్‌ మీద తిరగాడని, షూస్‌, సాక్స్‌ తీసేశాడని తెలిపింది. ఈ చర్యలతో ఆ వ్యక్తి పక్క సీటులోనే ఉన్నా తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని పేర్కొంది.

ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడనీ, వచ్చి పక్కన కూర్చోవాలన్నాడని తెలిపింది. ఇంత జరగుతున్నా ఫ్లైట్‌ సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆ తర్వాతే తానే సీటు మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఆమె ట్వీట్లకు నెటిజన్లు భారీస్థాయిలో స్పందిస్తున్నారు. 12వేలకు పైగా ఆమె ఆవేదనపై స్పందించారు. వారికి కూడా గతంలో ఎదురైన అనుభవాలను పంచుకొని ఆమె ఆగ్రహానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement