కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలు హరించడమే కాదు.. మనుషుల మధ్య దూరాలను పెంచుతోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 95కు పైగా దేశాలకు విస్తరించింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో కరోనాపై పలురకాల మీమ్స్, జోక్స్, టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు. కరోనాపై చేసే ప్రతి వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కరోనా పారిపోవాలంటూ మహిళలంతా ఒకచోట ఉండి పాడిన ఓ పాట వైరల్ అవుతోంది. చదవండి: కరోనా ఎఫెక్ట్: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ
కాంగ్రెస్ నేత కృష్ణ మోహన్ శర్మ ఈ వీడియోను ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు. 'భాగ్ జా రీ కరోనా భాగ్ జా' అంటూ కొంత మంది మహిళలు ఈ పాటను పాడారు. అయితే ఇవే కాకుండా కరోనా గురించి భోజ్‌పురి సంగీత పరిశ్రమలో కొత్త పాటలు, వీడియోలు విడుదల అవుతూనే ఉన్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాలకు చెందిన 3,595 మంది చనిపోగా, బాధితుల సంఖ్య 105,836కు చేరుకుంది. చైనా (3,097 మరణాలు, 80,695 కేసులు) ఆ తర్వాత దక్షిణ కొరియా(48 మరణాలు, 7,134 కేసులు), ఇరాన్(194 మర ణాలు, 6,566 కేసులు), ఫ్రాన్సు (16 మృతులు, 949 కేసులు) ఉన్నాయి. అమెరికాలో కోవిడ్‌తో 17 మంది చనిపోగా 420 కేసులు బయటపడ్డాయి. అర్జెంటీనాలో మొదటి మరణం సంభవించింది. బల్గేరియా, పరాగ్వే తదితర దేశాల్లోనూ కోవిడ్ బాధితులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment