అమ్మాయిలు తిప్పేశారు | 6-wicket victory over West Indies in the first ODI | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు తిప్పేశారు

Published Thu, Nov 10 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

అమ్మాయిలు తిప్పేశారు

అమ్మాయిలు తిప్పేశారు

భారత మహిళల శుభారంభం 
తొలి వన్డేలో విండీస్‌పై 6 వికెట్ల విజయం 

విజయవాడ స్పోర్‌‌ట్స: స్పిన్నర్లు రాణించడంతో భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడి మూలపాడులో ఏసీఏ నిర్మించిన కొత్త స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్ (4/21), ఏక్తా బిస్త్ (3/14) వెస్టిండీస్ బ్యాట్స్‌వుమెన్‌ను కట్టిపడేశారు. దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 42.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. మెరిస్సా అగులెరియా (77 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, ఓపెనర్ హేలీ మాథ్యూస్ 24 పరుగులు చేసింది. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శిఖా పాండేకు ఒక వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 39.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోరుు 133 పరుగులు చేసి గెలిచింది. షకీరా సెల్మన్ (2/11) దెబ్బకు ఆరంభంలో భారత్ తడబడింది. 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోరుుంది. తొలుత స్మృతి మందన (7), కాసేపటికే మోన మేశ్రం (2) షకీర బౌలింగ్‌లో నిష్క్రమించారు. దీప్తి (16), హర్మన్‌ప్రీత్ కౌర్ (1) కూడా వెనుదిరిగారు. ఈ దశలో వేద కృష్ణమూర్తి (70 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (91 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీళ్లిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 97 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. హేలీ మాథ్యూస్, అఫి ఫ్లెచర్‌లు చెరో వికెట్ తీశారు. ఈ నెల 13న ఇక్కడే రెండో వన్డే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement