సాక్షి, హైదరాబాద్: ఆలిండియా హైకోర్టు లాయర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జట్టు సత్తాచాటింది. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో రాష్ట్ర హైకోర్టు లాయర్ల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు లాయర్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏపీ జట్టు... అలహాబాద్ హైకోర్టు జట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఏపీ జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది.
ఠాకూర్ కరణ్ సింగ్ (56) అర్ధసెంచరీ సాధించగా, సయ్యద్ మన్సూర్ 33, సుమన్ గౌడ్ 32 పరుగులు చేశారు. ప్రత్యర్థి బౌలర్ ఫైజాన్ సిద్దిఖీ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అలహాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫైజాన్ సిద్ధిఖీ 26, శేఖర్ యాదవ్ 27, శైలేశ్ పాండే 30 పరుగులు చేశారు. ఏపీ బౌలర్లలో షాహిద్ 5 వికెట్లు తీయగా, సతీశ్ 2 వికెట్లు పడగొట్టాడు.
సెమీస్‌లో ఏపీ హైకోర్టు
Published Tue, Oct 15 2013 11:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement