
పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-బిలో పాకిస్తాన్-శ్రీలంక జట్లు నాకౌట్ సమరానికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. దాంతో ఇరు జట్ల గెలుపు కన్నేశాయి. గత మ్యాచ్ లో లంకేయులు డిఫెండింగ్ చాంపియన్ భారత్ ను కంగుతినిపించడంతో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరొకవైపు పెద్దగా అంచనాలు లేని పాకిస్తాన్ సైతం దక్షిణాఫ్రికా లాంటి నంబర్ వన్ జట్టును ఓడించడం ఆ జట్టు ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. దాంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యర్థి లంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మరొకవైపు ఐసీసీ నిర్వహించిన వన్డే టోర్నీల్లో శ్రీలంకపై పాకిస్తాన్ తొమ్మిదిసార్లు గెలవడం ఇక్కడ విశేషం. ఐసీసీ వన్డే టోర్నీల్లో లంకపై పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2002 చాంపియన్స్ ట్రోఫీలో ప్రేమదాస స్టేడియంలో జరిగిన వన్డేలో పాక్ పై లంక గెలిచింది. ఇది పాకిస్తాన్ కు కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీలంక తుదిజట్లు: ఏంజెలో మాథ్యూస్(కెప్టెన్), కుశాల్ మెండిస్, డిక్ వెల్లా, గుణ తిలకా, చండిమాల్, గుణరత్నే, ధనంజయ డిసిల్వా, పెరీరా, లక్మల్, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్
పాకిస్తాన్ తుదిజట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), అజహర్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, ఫహీమ్ అష్రాఫ్, మొహ్మద్ అమిర్, హసన్ అలీ, జునైద్ ఖాన్