రహానే, కోహ్లి సెంచరీలు | ajinkya rahane third test century | Sakshi
Sakshi News home page

రహానే, కోహ్లి సెంచరీలు

Published Sun, Dec 28 2014 9:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

ajinkya rahane third test century

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మన్ అజింక్య రహానే, విరాట్ కోహ్లి సెంచరీలు సాధించారు. ముందుగా రహానే సెంచరీ కొట్టాడు. 127 బంతుల్లో 13 ఫోర్లు శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది మూడో సెంచరీ. తర్వాత కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. 166 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది 9వ సెంచరీ.

 

108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్(68) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు పూజారా(25) అవుటయ్యాడు. టీ విరామ సమయానికి టీమిడింయా 3 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement