హైదరాబాద్ : ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ గాయపడిన విషయం తెలిసిందే. స్మిత్ మెడకు గాయం కావడంతో అతడు విలవిల్లాడాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్మిత్ గాయపడిన సమయంలో ఆర్చర్ ప్రవర్తించిన తీరుపట్ల పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తోటి క్రీడాకారుడు గాయంతో విలవిల్లాడుతుంటే ప్రవర్తించే తీరు ఇదా? అంటూ ఆర్చర్‌పై మండిపడ్డాడు. (చదవండి: ఇదేనా మీరిచ్చే గౌరవం: ప్రధాని ఆగ్రహం)
‘క్రికెట్‌లో బౌన్సర్‌లు అనేవి చాలా సాధారణం. కొన్ని సార్లు ఆ బంతులకు బ్యాట్స్‌మెన్ గాయాలపాలవుతారు. కానీ బ్యాట్స్‌మన్ గాయంతో బాధపడుతున్నప్పడు బౌలర్‌గా అతడి దగ్గరికి వెళ్లి మాట్లాడి, అతడి పరిస్థితి తెలుసుకోవడం కనీస మర్యాద. ఆ మర్యాద ఆర్చర్ విషయంలో కనిపించలేదు. స్మిత్ గాయంతో విలవిల్లాడుతుంటే నవ్వుతూ దూరంగా వెళ్లిపోయాడు. తొటి క్రీడాకారుడు గాయంతో బాధపడుతుంటే ప్రవర్తించే తీరు ఇదా?. నేనైతే అలా చేసేవాడిని కాదు. నా బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ గాయపడితే అందరికంటే ముందే అతడి దగ్గరికి చేరుకొని. గాయం గురించి వాకబు చేసేవాడిని’అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు.
ఇక అక్తర్ ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ‘నువ్వు చెప్పింది నిజమే. కానీ అంతలా ఆగ్రహం వ్యక్తం చేయకుండా. సున్నితంగా చెప్పొచ్చు కదా’అంటూ యువీ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఆటకు స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం స్మిత్ గాయం నుంచి కోలుకుంటున్నాడని.. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ధీమా వ్యక్తం చేస్తోంది.
చదవండి:
‘వారు క్రికెట్ లవర్సే కాదు’
స్టీవ్ స్మిత్ ఇస్మార్ట్ ఫీల్డ్ డ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment