లీడ్స్: భారత ఆటగాడు అలోక్ కుమార్ ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో అతను 5-1 ఫ్రేమ్‌ల తేడాతో సహచరుడు దేవేంద్ర జోషిపై విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఈ పోరులో అలోక్ 150-52, 150-34, 117-150, 150-37, 150-116, 150-138తో జోషిపై గెలుపొందాడు.
ఫైనల్లో భారత ఆటగాడు... ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ కాసియెర్‌తో తలపడతాడు. మరో సెమీస్‌లో కాసియెర్ 5-1 (150-46, 79-150, 150-37, 150-27, 150-28, 150-7) ఫ్రేమ్‌ల తేడాతో ఇంగ్లండ్‌కే చెందిన రాబర్ట్ హాల్‌ను కంగుతినిపించాడు.
ప్రపంచ బిలియర్డ్స్ ఫైనల్లో అలోక్
Published Sat, Oct 26 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement